మొగలయ్య: పద్మశ్రీని తిరిగిచ్చేస్తా

By udayam on May 19th / 8:52 am IST

ప్రముఖ కిన్నెర మొగలయ్య తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్ళుగా తెలంగాణ ప్రభుత్వమే తనను ఆదుకుంటోందని.. దీనిపై రాష్ట్ర బిజెపి నాయకులు రాజకీయాలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. పద్మశ్రీ అవార్డు అనంతరం తెలంగాణ ప్రభుత్వం మొగలయ్యకు 300 గజాల స్థలంతో పాటు రూ.1 కోటి ఆర్ధిక సాయాన్ని సైతం ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిపై బిజెపి నేతలు రాజకీయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​