బెంగళూరు ఎంతో నమ్మకంతో అట్టిపెట్టుకున్న హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో పాటు ఒక ఐపిఎల్ టోర్నీలో అత్యధిక సిక్సులు సమర్పించుకున్న చెత్త రికార్డునూ సొంతం చేసుకున్నాడు. నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 2 సిక్సులు కొట్టడంతో ఈ సీజన్ మొత్తంలో సిరాజ్ ఇచ్చిన సిక్సుల సంఖ్య 30 కు చేరింది. అతడి తర్వాత బ్రావో 29 (2018), చాహల్ 28 (2015) ఉన్నారు.