ఇంగ్లాండ్ కౌంటీల్లోకి సిరాజ్

By udayam on August 19th / 5:18 am IST

ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడనున్న భారత ఆటగాళ్ళ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే పుజారా, వాషింగ్టన్ సుందర్ లు అక్కడ క్లబ్ క్రికెట్ ఆడుతుంటే.. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ సైతం ఇప్పుడు వారితో జాయిన్ అవ్వనున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్-2022 సీజన్‌లోని చివరి మూడు మ్యాచ్‌లకు వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ సిరాజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ మీడియా సమావేశంలో గురువారం వెల్లడించింది. కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు ఆనుమతి ఇ‍చ్చిన బీసీసీఐకు సిరాజ్ కృతజ్ఞతలు చెప్పాడు.

ట్యాగ్స్​