మోహన్​ బాబు: పోలీసుల్లో 90 శాతం ప్రభుత్వానికి తొత్తులే

By udayam on December 20th / 11:24 am IST

చాలా వరకూ ఐపీఎస్​, ఐఎఎస్​ అధికారులు అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళకు తొత్తులుగా ఉంటున్నారని సీనియర్​ నటుడు మోహన్​ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న తిరుపతిలోని ఆయన కాలేజీలో జరిగిన విశాల్​ మూవీ ‘లాఠీ’ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ కు వచ్చిన మోహన్​ బాబు మాట్లాడుతూ ‘సార్​ ఇది నిజం.. ఇదీ జరిగింది.. నేను కళ్ళారా చూశాను. కానీ మీరు తప్పు చెప్పమంటున్నారు. నేను నిజం చూశాను అంటే అతడి ఉద్యోగం ఊడినట్లే’ అన్నారు. పై స్థాయి అధికారుల్లో ఎక్కువ శాతం ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటారని చెప్పారు. ఈ విషయాన్ని తాను బహిరంగంగా చెపుతానని అన్నారు.

ట్యాగ్స్​