రజనీ జైలర్​ లో మోహన్​ లాల్​

By udayam on January 9th / 11:30 am IST

‘అన్నాత్తె’ డిజాస్టర్ తదుపరి తలైవా రజినీకాంత్ నటిస్తున్న సినిమా “జైలర్”. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు రమ్యకృష్ణ, యోగిబాబు కీరోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ ‘కరునాడ చక్రవర్తి’ శివరాజ్ కుమార్ గారు ఒకముఖ్యపాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. తాజా అధికారిక సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మరొక ముఖ్యపాత్రలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ మేరకు జైలర్ సెట్స్ నుండి మోహన్ లాల్ స్టిల్ ను మేకర్స్ విడుదల చెయ్యడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ట్యాగ్స్​