మొసలి నోట చిక్కిన తల్లి.. కాపాడిన పిల్ల

By udayam on May 25th / 7:02 am IST

మన పురుణాల్లో నీరు తాగుతున్న ఏనుగును మొసలి కరచిన కథ వినే ఉంటారు. అచ్చం అలాంటిదే జాంబియాలోని ల్వాంగ్వా నేషనల్​ పార్క్​లో జరిగింది. ఓ ఆడ ఏనుగు దాని పిల్లతో సహా ల్వాంగ్వా నదిలో నీరు తాగుతుండగా మొసలి దాడి చేసింది. అయితే ఇక్కడ ఆ ఏనుగును కాపాడడానికి విష్ణుమూర్తి రూపంలో దాని పిల్ల మొసలిపై దాడికి దిగింది. తన తొండాన్ని మొసలి ఎంతకీ వదలక పోయే సరికి తల్లి ఏనుగు మొసలిని ఒడ్డుకు ఈడ్చుకురాగానే పిల్ల ఏనుగు దాని వీపుపైకి ఎక్కి తొక్కింది. దీంతో బతుకు జీవుడా అంటూ మొసలి నీట్లోకి పారిపోయింది.

ట్యాగ్స్​