కొవిడ్ తగ్గిన సమయంలో మంకీపాక్స్ వైరస్ విజృంభణ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 100కు పైగా కేసులు రావడంతో డబ్ల్యుహెచ్ఓ అప్రమత్తమైంది. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో తరచుగా తలెత్తే ఈ వ్యాధి ఇతర దేశాలకూ వేగంగా వ్యాపిస్తోందని పేర్కొంది. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాల్లోనూ ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయని యూరప్ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈ వ్యాధికి వ్యాక్సిన్ వేయించుకున్న వారినే దేశంలోకి అనుమతిస్తామని బెలారస్ పేర్కొంది.