కరోనా నుంచి కోలుకుంటున్న ప్రపంచంపై మంకీ ఫాక్స్ వైరస్ పంజా విసురుతోందని డబ్ల్యుహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ 23 దేశాల్లో 257 కు పైగా కేసులు నమోదైనట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వాలు ఈ వైరస్ను సీరియస్గా తీసుకుని నివారణ చర్యలు చేపట్టాలని ఆ సంస్థ పేర్కొంది. చిన్నారులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ వైరస్ వేగంగా పాకుతోందని పేర్కొంది.