27న కేరళకు రుతుపవనాలు

By udayam on May 25th / 12:45 pm IST

ఎండలతో మండిపోతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈనెల 27న రుతుపవనాలు కేరళను తాకనున్నాయని ప్రకటించింది. వీటి రాకతో ఈ సీజన్​లో వర్షపాతం సాధారణ స్థాయిలో ఉంటుందని తెలిపింది. ‘99 శాతం వర్షపాతంతో ఈ సీజన్​ సాధారణంగా ఉంటుంది. వచ్చే 5 రోజుల్లో కొంకణ్​, గోవా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి’ అని ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు కూడా ఈశాన్య అరేబియా సముద్రంలో యాక్టివ్​గానే ఉన్నాయని తెలిపింది.

ట్యాగ్స్​