నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో కేరళను పలకరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాధార ప్రాంతమైన భారత్ లో నైరుతి రుతుపవనాల వల్ల కురిసే వర్షాలతోనే చాలావరకూ పంటలు పండుతాయి. నిజానికి శుక్రవారమే నైరుతి కేరళకు తాకుతుందని ముందుగా వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ అవి కాస్త ఆలస్యమైంది. అయితే రానున్న 2–3 రోజుల్లో నైరుతి రాక తధ్యమని, కొంకణ్, గోవా, కేరళ ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయని పేర్కొంది.