వాతావరణ శాఖ: తిరోగమనంలో నైరుతి రుతపవనాలు

By udayam on September 20th / 12:57 pm IST

దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు వీటి తిరోగమనానికి అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. ఉత్తరం, పశ్చిమ భారత్​తో పాటు కచ్​ మీదుగా ఇవి మరో రెండు రోజుల్లో తిరోగమనం ప్రారంభిస్తాయని అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వల్ల భారత్​లో 7 శాతం అధిక వర్షపాతం నమోదయింది. అయితే పంట ఎక్కువగా పండే ఉత్తరప్రదేశ్​, బీహార్​లతో పాటు మరో ఆరు రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గింది.

ట్యాగ్స్​