చంద్రుని మట్టిలో మొలిచిన మొక్కలు

By udayam on May 13th / 11:56 am IST

1969–72 మధ్య కాలంలో అమెరికా జరిపిన అపోలో మిషన్​ల నుంచి తీసుకొచ్చిన చంద్రుని మట్టిలో తాజాగా మొక్కలు మొలిచాయి. ఈ విషయాన్ని ఫ్లోరిడా యూనివర్శిటీ పరిశోధకలు జరిపిన పరీక్షల్లో తేలింది. ‘చంద్రుని నుంచి తీసుకొచ్చిన రాళ్ళు, మట్టిలో మేం వేసిన విత్తనాలన్నీ మొలిచాయి. నిజానికి చంద్రుని మట్టి ఈ విత్తనాల్లోని హార్మోన్ల ఎదుగుదలను అడ్డుకోలేదు. మేం ఇలా జరుగుతుందని భావించలేదు. కానీ వీటి పెరుగుదల మాకు ఉత్సాహాన్నిచ్చింది’ అని వెల్లడించింది.

ట్యాగ్స్​