ఇది పాకిస్థాన్​కు బదులిచ్చే సమయం : అమిత్​ షా

By udayam on October 14th / 1:36 pm IST

జమ్మూ కశ్మీర్​తో పాటు దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్​ ప్రయత్నిస్తే ఇకపై మరింత గట్టిగా బదులిస్తామని హోం మంత్రి అమిత్​ షా హెచ్చరించారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంతకు ముందు చర్చలకు సమయం ఉండేదని, కానీ ఇప్పుడు బదులిచ్చే సమయం వచ్చేసిందన్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మరిన్ని మెరుపుదాడులు తప్పవని దాయాది దేశాన్ని హెచ్చరించారు.

ట్యాగ్స్​