అఫ్గానిస్తాన్‌లోని విదేశాంగశాఖ కార్యాలయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 20 మంది చనిపోయారని తాలిబాన్ పాలకులు వెల్లడించింది. ఈ దాడి చేసింది తామేనని ఐసిస్–కె సంస్థ ప్రకటించుకుంది. గత కొంతకాలంగా అఫ్గానిస్తాన్‌లో జరిగిన అనేక దాడులకు ఇస్లామిక్ స్టేట్ బాధ్యత తీసుకుంది. ఇటీవలే ఆ దేశంలోని విదేశీ రాయబార కార్యాలయాలైన చైనా, తుర్కియా భవనాల వద్ద ఐసిస్ బాంబు దాడులు చేస్తోంది. ‘ఓ వ్యక్తి తనను తాను పేల్చుకోవడం తాను కళ్ళారా చూశా’ అంటూ ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు వెల్లడించారు.