బాంబ్ బెదిరింపుతో మాస్కో–గోవా విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న అంజూర్ ఎయిర్ ఛార్టడ్ ఫ్లైట్ ను గుజరాత్ లోని జామ్ నగర్ కు మళ్లించారు. విమానంలో బాంబ్ ఉందని గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఈ మెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు జామ్ నగర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని చెప్పారు. మొత్తం 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో ఫ్లైట్ సోమవారం రాత్రి 9.49 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని జామ్ నగర్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. పోలీసులు, బాంబ్ డిటెక్షన్ డిస్పోజల్ స్క్వాడ్‌తో విమానాన్ని తనిఖీ చేస్తున్నారని చెప్పారు.