డెత్​ ఓవర్లలో ధోనీ అరుదైన రికార్డ్​

By udayam on May 9th / 11:49 am IST

ప్రపంచ క్రికెట్​లో అత్యుత్తమ ఫినిషర్​గా కొనసాగుతున్న చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​ ఎంఎస్​.ధోనీ తన పేరిట మరో రికార్డ్​ను నెలకొల్పాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్​ చేస్తూ 2500 పరుగులు సాధించిన ఏకైక ప్లేయర్​గా చరిత్ర సృష్టించాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో 8 బాల్స్​లోనే 21 పరుగులు చేసిన అతడు మ్యాచ్​కు తనదైన ఫినిషింగ్​ టచ్​ ఇచ్చాడు. ఈ ఐపిఎల్​లో చేసినవి తక్కువ పరుగులే అయినా ఫినిషర్​గా చివరి ఓవర్లలో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.

ట్యాగ్స్​