‘మా’ పూర్తి ప్యానెల్​ ఇదే

By udayam on October 12th / 11:40 am IST

మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​ ఎన్నికల్లో పూర్తి ప్యానెల్​ వివరాలు వెల్లడయ్యాయి. ప్రెసిడెంట్​గా మంచు విష్ణు 383 ఓట్లతో విజయం సాధించగా ప్రత్యర్ధి ప్రకాష్​ రాజ్​కు 274 ఓట్లు వచ్చాయి. జనరల్​ సెక్రటరీగా రఘుబాబుకు 341 ఓట్లు, ఎగ్జిక్యూటివ్​ వైస్​ ప్రెసిడెంట్​గా శ్రీకాంత్​కు 375 ఓట్లు, జాయింట్​ సెక్రటరీలుగా ఉత్తేక్​కు 333 ఓట్లు, గౌఐతం రాజ్​కు 322 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షులుగా మాదాల రవి 376 ఓట్లు, బెనర్జీకి 298 ఓట్లతో ఎంపిక కాగా, ట్రెజరర్​గా శివ బాలాజీ 360 ఓట్లతో గెలుపొందాడు. ఈసీ సభ్యుల్లో విష్ణు ప్యానెల్​ నుంచి 10 మంది, ప్రకాష్​ రాజ్​ ప్యానెల్ ​నుంచి 8 మంది విజయం సాధించారు.

ట్యాగ్స్​