నవనీత్ కౌర్ దంపతులకు బెయిలు

By udayam on May 4th / 7:40 am IST

హనుమాన్​ చాలీసా వివాదంలో అరెస్ట్​ అయిన టాలీవుడ్​ మాజీ నటి, మహారాష్ట్రలోని అమరావతి ప్రాంత ఎంపి నవనీత్​ కౌర్​ రానా, ఆమె భర్త రవి రానాలకు ఈరోజు బెయిల్​ మంజూరైంది. మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్​ ఠాక్రే నివాసం ముందు హనుమాన్​ చాలీసా చదువుతానని బెదిరింపులకు దిగడంతో ఆమెను శాంతి, భద్రతలకు భంగం కలిగిస్తున్నారనే ఆరోపణలపై ఏప్రిల్​ 23న పోలీసులు అరెస్ట్​ చేశారు. 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీలో ఉన్న ఈ జంటకు కొన్ని షరతులపై ముంబై సెషన్స్​ కోర్ట్​ ఈరోజు బెయిల్​ మంజూరు చేసింది.