4:32 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

పార్లమెంటరీ కమిటీ నుంచి ఎంపీ కృష్ణం రాజుపై వేటు 2 weeks ago

వైసిపి ఎంపీగా ఉంటూనే తరచూ జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎంపీ రాఘురామకృష్ణం రాజుపై వేటుపడింది. ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న  పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి తప్పించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు.

రుణాల ఎగవేత కేసులో రాఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొంది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు తెలిపింది.

నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నందున అతన్ని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి తప్పించింది. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని లోక్‌సభ సచివాలయం తెలిపింది.