అవన్నీ ధోనీ సలహాలే : నటరాజన్​

By udayam on April 7th / 7:26 am IST

గతేడాది ఐపిఎల్​లో హైదరాబాద్​ తరపున అరంగేట్రం చేసిన లెఫ్ట్ ఆర్మ్​ యార్కర్​ స్పెషలిస్ట్​ నటరాజన్​ తనకు భారత మాజీ కెప్టెన్​ ధోనీ ఇచ్చిన సలహాలు ఉపయోగపడ్డాయని వివరించాడు. స్లో బౌన్లర్లు, కట్టర్లు వేయమని ధోనీనే చెప్పాడని అప్పటి నుంచి వాటిపై దృష్టి పెట్టినట్లు చెప్పాడు. ఫిట్​గా ఉంటూనే స్లో బాల్స్​పై కూడా దృష్టిపెట్టాలని ధోనీ చెప్పాడన్నాడు. గతేడాది నటరాజన్​ ఐపిఎల్​లో 71 యార్కర్లు వేశాడు. ఆ ఏడాది ఏ బౌలర్​ కూడా అన్ని యార్కర్లు సంధించలేదు.

ట్యాగ్స్​