ధోనీ సిక్స్​కు.. గ్రౌండ్​ దాటిన హాట్​స్టార్​ రేటింగ్​

By udayam on October 13th / 4:48 am IST

ఢిల్లీతో జరిగిన తొలి ఐపిఎల్​ క్వాలిఫైయర్​ మ్యాచ్​లో ధోనీ 18వ ఓవర్లో కొట్టిన సిక్స్​ దెబ్బకు హాట్​స్టార్​ వ్యూయర్​షిప్​ ఆకాశానికి అందుకుంది. అతడు క్రీజులోకి వచ్చినప్పటి నుంచి మ్యాచ్​ ముగిసే వరకూ హాట్​స్టార్​లో 64 లక్షల మంది లైవ్​లో మ్యాచ్​ను చూశారని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఐపిఎల్​ సీజన్​లో ఇదే అత్యధిక వ్యూయర్​షిప్​గా హాట్​స్టార్​ ప్రకటించింది. చివరి 2 ఓవర్లలో 24 పరుగులు కావాల్సి ఉండగా వచ్చిన ధోనీ ఒక సిక్సు, 3 ఫోర్లు కొట్టి చెన్నైను ఒంటిచేత్తో ఫైనల్​కు చేర్చిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​