చెన్నై జట్టులో తాను జడేజాను బాగా మిస్ అవుతున్నానని ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పుకొచ్చాడు. కొన్ని మ్యాచుల్లో రాణించలేనంత మాత్రాన అతడిని తక్కువ చేయలేమని చెప్పిన ధోనీ.. కెప్టెన్‌కు కావాల్సిన ప్రయోగాలను చేయడానికి జడేజా లాంటి ప్లేయర్ కావాలన్నాడు. .ఫీల్డింగ్‌లో జడేజా లాంటి వ్యక్తిని మనం అంత త్వరగా రీప్లేస్ చేయలేమని చెప్పాడు. ముంబైతో మ్యాచ్‌లో ఓటమిపై మాట్లాడిన ధోనీ.. ఇంత తక్కువ స్కోరునూ కాపాడుకోవడానికి మా బౌలర్లు చేసిన ప్రయత్నం బాగుందన్నాడు.