రిలయన్స్​ రిటైల్​ ఛైర్ పర్సన్​గా ఈషా అంబానీ!

By udayam on June 29th / 10:56 am IST

ముకేష్​ అంబానీ రిటైర్మెంట్​ జీవితానికి మరింత దగ్గర కానున్నారు. మంగళవారం జియో బోర్డ్​కు రాజీనామా ఇచ్చేసిన ఆయన తన కుమారుడు ఆకాష్​ అంబానీని జియో సంస్థకు ఛైర్మన్​గా నియమించారు. అయితే ఇదే సమయంలో ఆయన కూతురు ఈషా అంబానీని రిలయన్స్​ రిటైల్​ యూనిట్​కు ఛైర్ పర్సన్​గా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ నియామకం పూర్తయిందని, అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి అన్న ప్రచారం జరుగుతోంది. బుధవారమే ఈ ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.

ట్యాగ్స్​