అంబానీకి భద్రత పెంచిన కేంద్రం

By udayam on September 30th / 7:06 am IST

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ భద్రతను కేంద్ర హోంమంత్రిత్వశాఖ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిఘా సంస్థల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ కుబేరుడికి మరింత రక్షణను కల్పించడానికి కేంద్రం సిద్ధమైంది. ఇకపై ముకేష్​ చుట్టూ 58 మంది భద్రతా సిబ్బంది ఉండనున్నారు. గతేడాది అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న వాహనాన్ని నిలపడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే భారీగా పెరిగిన భద్రతా సిబ్బంది జీతభత్యాలను అంబానీనే ఇస్తారని తెలుస్తోంది.

ట్యాగ్స్​