ముంబై ఇండియన్స్​ జట్టులో కరోనా కేసు

By udayam on April 6th / 11:16 am IST

ఐపిఎల్​ తొలి మ్యాచ్​కు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ జట్లలో కరోనా కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఐపిఎల్​ అగ్ర జట్టు ముంబై ఇండియన్స్​లో కరోనా కేసు బయటపడింది. ఆ జట్టు వికెట్​ కీపింగ్​ కన్సల్టెంట్​ కిరణ్​ మూర్​ ఈ వైరస్​ బారిన పడినట్లు ముంబై జట్టు తన ట్విట్టర్​ ఖాతాలో వెల్లడించింది. అతడికి ఎలాంటి లక్షణాలు లేవని, తమ వైద్య బృందం పర్యవేక్షిస్తోందని వెల్లడించింది. ఢిల్లీకి చెందిన అక్షర్​, బెంగళూరుకు చెందిన పడిక్కల్​కు కరోనా పాజిటివ్​గా తేలింది.

ట్యాగ్స్​