ముంబైలో కరోనా మరణాలు నిల్​

By udayam on October 18th / 6:04 am IST

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో తొలిసారిగా కొవిడ్​ మరణాలు జీరో స్థాయికి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో ఈ మహానగరంలో 367 కేసులు రాగా ఒక్కరు కూడా కొవిడ్​తో మరణించలేదు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్​ కమిషనర్​ ఇక్బాల్​ సింగ్​ చాహల్​ పిటిఐ వార్తాసంస్థకు వెల్లడించారు. పాజిటివిటి రేట్​ కూడా 1.27 శాతానికి తగ్గిందని, 5030 యాక్టివ్​ కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

ట్యాగ్స్​