ధీరూభాయి అంబానీ స్కూలుకు బాంబు బెదిరింపులు

By udayam on January 11th / 11:50 am IST

ముంబైలోని ధీరూభాయి అంబానీ స్కూల్​ కు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు మీద స్కూలుకు చేరుకుని తనిఖీలు చేపట్టి అది ఉత్త్తుత్తి బెదిరింపుగా తేల్చేశారు. అయితే ఈ ఘటనను సీరియస్​ గా తీసుకున్న పోలీసులు ఫోన్​ చేసిన వ్యక్తి ని గుర్తించే పనిలో ఉన్నారు. 2021 అక్టోబర్​ లో అంబానీ కుటుంబానికి బెదిరింపులు రావడంతో ముంబై రాజకీయాలే తలకిందులైన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర) హోం మంత్రితో పాటు డిజిపి కూడా తమ పదవులను కోల్పోయారు.

ట్యాగ్స్​