తుని : టిడిపి నేత శేషగిరి పై హత్యాయత్నం

By udayam on November 17th / 7:39 am IST

ఏపీలో టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం తీవ్ర కలకలం రేపుతుంది. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకుడు శేషగిరిరావుపై భవాని మాలలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో శేషగిరి రావు చేతికి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.దాడి అనంతరం దుండగుడు బైక్​ పై పారిపోయాడు. ఈ ఘటన మొత్తం సిసిటివి ల్లో రికార్డ్​ అయింది. కత్తిని కనిపించకుండా దుండగుడు తన దగ్గర ఉన్న టవల్ తో కప్పి ఉంచాడు. ఎప్పుడైతే శేషగిరి రావుపై దాడి చేద్దామనుకున్నాడో ఆ సమయానికే సరిగ్గా కత్తి బయటకు తీసి దాడి చేశాడు.

ట్యాగ్స్​