టెస్టుల్లో ముష్ఫికర్​ రహీం అరుదైన రికార్డ్​

By udayam on May 18th / 12:11 pm IST

బంగ్లాదేశ్​ సీనియర్​ క్రికెటర్​ ముష్ఫికర్​ రహీం ఆ దేశ టెస్ట్​ క్రికెట్​ చరిత్రలో 5 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్​గా రికార్డులకెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్​లో భాగంగా 230 బాల్స్​ ఆడి 86 పరుగులు చేసిన అతడు ఈ 5 వేల మార్క్​ను చేరుకున్నాడు. మరో సీనియర్​ క్రికెటర్​ తమీమ్​ ఇక్బాల్​ రిటైర్డ్​ హర్ట్​గా ఔట్​ అయి ఈ రికార్డుకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్​లో తమీమ్​ 133 పరుగులు చేసి కెరీర్​లో 4981 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ట్యాగ్స్​