ట్విట్టర్​ నుంచి పరాగ్​కు సెలవు!

By udayam on May 3rd / 6:01 am IST

ట్విట్టర్​ను కొనుగోలు చేసిన ఎలన్​ మస్క్​ ఇప్పుడు ఆ సంస్థ సీఈఓ నుంచి భారతీయ అమెరికన్​ పరాగ్​ అగర్వాల్​ను తప్పించేయాలని ప్లాన్​ చేస్తున్నాడు. ఇటీవల ట్విట్టర్​ ఛైర్మన్​ బ్రెట్​ టేలర్​తో సమావేశమైన మస్క్​.. పాత కార్యవర్గంపై తనకు ఎలాంటి నమ్మకం లేదని అభిప్రాయపడ్డాడు. దీంతో పరాగ్​ను తప్పించడం పక్కా అని రాయిటర్స్​ సంస్థ పేర్కొంది. ఒకవేళ పరాగ్​ను సీఈఓ నుంచి తప్పించాల్సి వస్తే మస్క్​.. పరాగ్​కు 42 మిలియన్​ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

ట్యాగ్స్​