మస్క్​ : పనిచేయండి లేదా ఉద్యోగం వదిలేయండి

By udayam on November 17th / 5:53 am IST

ట్విట్టర్ సిబ్బంది అత్యధిక తీవ్రతతో ఎక్కువ గంటల పాటు పనిచేయడానికి కట్టుబడి ఉండాలని లేనిపక్షంలో కంపెనీ నుంచి వెళ్లిపోవాలని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించాడు. కంపెనీని తన హస్తగతం చేసుకున్న రోజు నుంచీ ట్విట్టర్​ ఉద్యోగులపై ఏదో పాత కక్షలు ఉన్నట్లు వ్యవహరిస్తున్న ఆయన తీరు ప్రతీరోజూ వివాదాస్పదమవుతోంది. ట్విట్టర్‌లో ఉండాలనుకుంటే ఈ ప్రతిజ్ఞకు అంగీకరించాల్సిందే అని సిబ్బందికి రాసిన ఈమెయిల్‌లో ఎలాన్ మస్క్ పేర్కొన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టింది.వారానికి కనీసం 40 గంటలు సిబ్బంది కార్యాలయంలోనే ఉండాలని ఈమెయిల్‌లో రాసినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది.

ట్యాగ్స్​