ఆస్కార్​ గడప తొక్కిన ‘నాటు నాటు’

By udayam on December 22nd / 5:10 am IST

టాలీవుడ్​ లో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపిన ఆర్​ఆర్​ఆర్​ మూవీ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు రేస్​ కు నామినేట్​ అయింది. ప్రతిష్టాత్మక ఆస్కార్​ అవార్డ్​ నామినేషన్స్​ లో ఈ మూవీలోని ‘నాటు నాటు’ కు బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​ నామినేషన్​ దక్కింది. ఆర్​ఆర్​ఆర్​ తో పాటు మరో మూడు భారతీయ సినిమాలకూ ఆస్కార్​ నామినేషన్లు దక్కాయి. ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో లాస్ట్​ ఫిల్మ్ షో, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్​ కేటగిరీలో ఆల్​ దట్​ బ్రీత్స్​, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్​ ఫిలిం కేటగిరీలో ది ఎలిఫెంట్​ విష్పరర్​ లు చోటు దక్కించుకున్నాయి.

ట్యాగ్స్​