జక్కన్న: నాటు నాటు పాట తీసింది ఉక్రెయిన్​ అధ్యక్ష భవనం ముందే

By udayam on January 11th / 9:58 am IST

ప్రపంచ ప్రఖ్యాత గోల్డెన్​ గ్లోబ్​ అవార్డు దక్కించుకున్న ఆర్​ఆర్​ఆర్​ లోని నాటు నాటు పాటకు సంబంధించిన కీలక విషయాన్ని జక్కన్న రాజమౌళి ఇటీవల వెల్లడించారు. ఈ పాటను ఉక్రెయిన్​ అధ్యక్షుడు ఒలొదిమిర్​ జెలెన్​ స్కీ అధ్యక్ష కార్యాలయం ‘మరీన్​ స్క్యీ ప్యాలెస్​ కు ముందే తెరకెక్కించారట. 2021 లో ఈ పాట తెరకెక్కించే సమయానికి అక్కడ ఎలాంటి యుద్ధ వాతావరణం లేదని, ఈ ప్యాలెస్​ కు వెనుక వైపు ఉక్రెయిన్ పార్లమెంట్​ భవనం ఉంటుందని రాజమౌళి.. దర్శకుడు సందీప్​ వంగాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ట్యాగ్స్​