కన్నా ఇంటికి నాదెండ్ల

By udayam on December 15th / 7:05 am IST

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్​.. బిజెపి అసంతృప్త నేత కన్నా లక్ష్మీ నారాయణతో ఆయన ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు. కన్నాను అధికారికంగా జనసేనలోకి ఆహ్వానించేందుకు నాదెండ్ల ఆయన ఇంటికి వెళ్ళారంటూ ప్రచారం నడుస్తోంది. పొత్తులో ఉన్నప్పటికీ అంటీ ముట్టనట్టుగా ఉంటున్న జనసేన–బిజెపిలు ఈ కలయికపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ట్యాగ్స్​