ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కించనున్న నేపథ్యంలో అసలు దీనిపై అప్ డేట్ ఏమిటి అంటూ ఫాన్స్ ఆతృతగా చూస్తున్నారు.
దీపికా పడుకోన్ కథానాయిక నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Exact ga cheppalante…29th Jan and 26th feb.. :))
— Nag Ashwin (@nagashwin7) January 23, 2021
సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తానని ఈ నెల ప్రారంభంలో దర్శకుడు చెప్పారు.
అయితే సంక్రాంతి పండుగ వెళ్లి పదిరోజులు కావొస్తున్నా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో నెటిజన్లు ట్విటర్ వేదికగా దర్శకుడిపై ప్రశ్నలు సంధించారు.
దీనికి సంబంధించి నాగ అశ్విన్ అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. ‘జనవరి 29న ఒక అప్డేట్, ఫిబ్రవరి 26న మరొకటి.. కచ్చితంగా ఉంటాయి’ అని సమాధాన మిచ్చారు. దీంతో ప్రభాస్ ఫాన్స్ లో ఆనందం వెల్లివిరిస్తోంది.