నాగచైతన్య, సమంతల కెరీర్ ను మలుపుతిప్పిన మూవీ ‘ఏ మాయ చేశావే’. ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ, గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ కలిసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మూవీకి సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడట గౌతమ్ మీనన్. 12 ఏళ్ళ తర్వాత రానున్న ఈ సీక్వెల్ లో మరోసారి హీరోగా నాగ చైతన్య కే అవకాశం దక్కగా.. హీరోయిన్ గా మాత్రం సమంత స్థానంలో రష్మిక చేరినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది!