తమిళంలో మానాడు మూవీతో సూపర్ హిట్ కొట్టిన వెంకట్ ప్రభు.. తెలుగు యువ హీరో నాగ చైతన్యతో కలిసి ఓ సినిమాను సిద్ధం చేస్తున్నాడు. చై కెరీర్లో 22వ చిత్రంగా రానున్న ఈ మూవీ అప్డేట్ రేపు ఉదయం 9.01 గంటలకు ప్రకటించనున్నారు. ఒకేసారి తెలుగు, తమిళం భాషల్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకోనుంది. ఈ ఏడాది చైతన్య బంగార్రాజు మూవీతో హిట్ అందుకుని ఇప్పుడు థాంక్యూ, లాల్ సింగ్ ఛడ్డా సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. దీంతో అతడు తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ ‘దూత’ కూడా ఈ ఏడాదే విడుదల కానుంది.