NC22 ప్రీ లుక్​: అతడి ఆవేశాన్ని ఏ శక్తీ అదుపు చేయదు

By udayam on November 22nd / 10:02 am IST

నాగ చైతన్య NC22 ప్రీ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో NC22 పేరిట ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ లో ప్రియమణి తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ , టైటిల్‌ ను రేపు రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు. ‘అతని ఆవేశాన్ని ఏ శక్తీ అదుపు చేయదు’ అంటూ రిలీజ్ చేసిన #NC22 భీకరమైన ప్రీ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో పోలీస్ గెటప్ లో ఉన్న నాగచైతన్య ను కొందరు పోలీసులు గన్నులు గురి పెట్టి అతన్ని బంధించడానికి ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్​