నాగబాబు: జగన్​ సంకుచిత ఆలోచనలకు నిదర్శనం ఈ జీవో

By udayam on January 4th / 5:28 am IST

రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ వీడియో పెట్టారు. వైసీపీ ప్రభుత్వ సంకుచిత మనస్తత్వానికి ఈ జీవో నిదర్శనం అన్నారు. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించడం రాజకీయ పార్టీల హక్కు అన్నారు. ఈ జీవోపై కోర్టుకెళ్తే మరోసారి ఏపీ ప్రభుత్వానికి చివాట్లు తప్పవన్నారు. సభలు నిర్వహించినప్పుడు రాజకీయ పార్టీలు తగిన జాగ్రతలు తీసుకుంటాయన్నారు. అలాగే ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.

ట్యాగ్స్​