నాగార్జున–నరేష్​ కాంబో ఫిక్స్​!

By udayam on December 30th / 7:25 am IST

ధమాకా రచయిత ప్రసన్న కుమార్ బెజవాడతో నాగార్జున నెక్స్ట్ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి బయటకు వచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో నాగార్జున మరొక యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని టాక్. ఆయనెవరో కాదు.. నాగ్ వీరాభిమాని అల్లరి నరేష్. ఈ సినిమాలో నాగ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించడానికి రెడీ అవుతున్నారట. ఈ ఏడాది నాగ్​ బంగార్రాజు, ఘోస్ట్​ సినిమాలతో తన అభిమానులను పలకరించిన సంగతి తెలిసిందే.

 

ట్యాగ్స్​