వీరయ్య ఫంక్షన్​ కు వీర సింహారెడ్డి!

By udayam on December 30th / 7:07 am IST

మెగాస్టార్​ చిరంజీవి, రవితేజ కాంబోలో సిద్ధమైన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్​ ఈవెంట్​ త్వరలోనే వైజాగ్​ లో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్​ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఈవెంట్​ కు చీఫ్​ గెస్ట్​ గా నందమూరి బాలకృష్ణ రానున్నట్లు సమాచారం. ఆయన నటిస్తున్న వీర సింహారెడ్డి చిత్రం కూడా పండగ రిలీజ్​ కు ఉండడం, ఆ మూవీకి, వాల్తేరు వీరయ్యకు ప్రొడ్యూసర్స్​ ఒకరే కావడం తెలిసిందే. దీంతో నిర్మాతలు బాలయ్యను కూడా ఈ ఈవెంట్​ కు పిలవాలని ఆలోచిస్తున్నారు.

ట్యాగ్స్​