బాలయ్య: చెంఘిజ్​ ఖాన్​ మూవీ నా డ్రీమ్​ ప్రాజెక్ట్​

By udayam on January 7th / 7:52 am IST

‘చెంఘీజ్ ఖాన్ సినిమా చేయాలనేది నా జీవిత ఆశయం. ఇద్దరు క్రాక్‌లు కలిస్తే ఎలా ఉంటుందో? గోపీచంద్ మలినేని, నేను కలిస్తే అలా ఉంటుంది. ఒంగోలు గిత్త ఈ గోపీచంద్ మలినేని అన్నారు నందమూరి బాలకృష్ణ. నిన్న ఒంగోలులో జరిగిన ఆయన తాజా చిత్రం ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నాకు ఇంకా కసి తీరలేదు. బాలకృష్ణ ఇక రాడులే.. రాజకీయాలకే పరిమితంలే అనుకున్నారు. కానీ కొత్తగా ట్రై చేస్తున్నా. ఈ క్రమంలో చేసిన ఆహా అన్‌స్టాబబుల్ ఇప్పుడు టాక్ షోలకే అమ్మ మొగుడై కూర్చుంది. ఏదో కొత్తదనం ఇవ్వాలనే తాపత్రయంలో చేసిందే ఆ షో.’ అంటూ ఆయన చెప్పారు.

ట్యాగ్స్​