జనవరి 20 నుంచి ‘అఖండ’ బాలీవుడ్​ ఎంట్రీ

By udayam on January 6th / 7:05 am IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా OTTలో కూడా సెన్సషనల్ రికార్డ్స్ ని సృష్టించింది. తాజాగా ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా హిందీలో విడుదలవుతోంది. అఖండ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను పెన్ స్టూడియోస్‌కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా మరియు సాజిద్ ఖురేషి విడుదల చేస్తున్నారు. తాజగా మూవీ మేకర్స్ ఈ సినిమా హిందీ ట్రైలర్ ని కూడా విడుదల చేసారు. అఖండ హిందీ వెర్షన్ జనవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.

ట్యాగ్స్​