డిసెంబర్​ 24న ‘శ్యామ్​ సింగరాయ్​’

By udayam on October 18th / 6:33 am IST

నేచురల్​ స్టార్​ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ‘శ్యామ్​ సింగరాయ్​’ చిత్రం రిలీజ్​ డేట్​ వచ్చేసింది. క్రిస్​మస్​ సందర్భంగా డిసెంబర్​ 24న ఈ చిత్రాన్ని ధియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు నాని ట్వీట్​ చేశాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించాడు. మిక్కీజే మేయర్​ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మడోన్న సెబాస్టియన్​ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. రాహుల్​ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ట్యాగ్స్​