నాని ప్రొడ్యూసర్ గా తీస్తున్న సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ హిట్ లో సెకండ్ పార్ట్ వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీలో వచ్చే మూడో పార్ట్ లో నటించే హీరో లిస్ట్ ఇదంటూ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. హిట్–3 లో మల్టీస్టారర్లు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. నాని, విజయ్ సేతుపతి, హిట్–2 హీరో అడవి శేష్ లు ఈ చిత్రంలో కనిపించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన సైతం త్వరలోనే రానున్నట్లు వినికిడి.