కెజిఎఫ్తో పాన్ ఇండియా డైరెక్టర్గా ఎదిగిన ప్రశాంత్ నీల్.. మరో టాలీవుడ్ హీరోతో పాన్ ఇండియా చిత్రాన్ని తీయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని, ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ చేతిలో సలార్, ఎన్టీఆర్ చిత్రంతో పాటు కెజిఎఫ్ పార్ట్ 3 సైతం ఉన్నాయి. ఇవన్నీ అయితే గానీ నాని చిత్రంపై క్లారిటీ రాదు. నాని ప్రస్తుతం దసరా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.