18 పేజెస్​: నన్నయ్యరాసిన కావ్యమాగితే.. ఫుల్​ సాంగ్​ వచ్చేసింది

By udayam on November 22nd / 12:04 pm IST

నిఖిల్​, అనుపమ పరమేశ్వరన్​ ల లేటెస్ట్​ లవ్​ స్టోరీ ‘18 పేజెస్​’ నుంచి ‘నన్నయ రాసిన’ పాట లిరికల్​ వీడియో వచ్చేసింది. వచ్చే నెల 23న విడుదల కానున్న ఈ మూవీ కి.. డైరెక్టర్​ సుకుమార్​ కథ అందిస్తుంటే.. పల్నాటి సూర్య ప్రతాప్​ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కార్తికేయ–2 వంటి బ్లాక్​ బస్టర్​ అందుకున్న నిఖిల్​, అనుపమ పరమేశ్వరన్​ ల నుంచి వస్తున్న ఈ మూవీపై యూత్​ లో మంచి క్రేజ్​ ఉంది. అందకు తగ్గట్టే ఈరోజు రిలీజైన ‘నన్నయ్య రాసిన కావ్యమాగితే’ సాంగ్​ విపరీతంగా ఆకట్టుకుంటోంది. గోపీ సుందర్​ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్​ అందించగా.. ప్రధ్వీ చంద్ర, సితార కృష్ణకుమార్​ లు ఆలపించారు.

 

ట్యాగ్స్​