నాకు తోడున్న వారందరికీ కృతజ్ఞతలు : భువనేశ్వరి

By udayam on November 26th / 10:23 am IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు స్పందించి నిరసన తెలిపిన అందరికీ కృజ్ఞతలు చెబుతున్నట్లు టిడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసిన ఆమె ‘తనపై చేసిన ఈ వ్యాఖ్యలను మీ కుటుంబాల్లోని వ్యక్తులపై చేసినట్లు స్పందించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. మీరు నా వెంటే నిలబడ్డారన్న విషయం జీవితంలో మరిచిపోను. మా తల్లిదండ్రులు మమ్మల్ని విలువలతో పెంచారు. మేం వాటిని నేటికీ పాటిస్తున్నాం. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదు’ అని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్​