‘యువగళం’ పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర

By udayam on December 28th / 7:49 am IST

ఆంధ్రప్రదేశ్‌లో 4వేల కిలోమీటర్ల మేర నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ప్రకటించింది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పాదయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ‘యువగళం’ పేరుతో సాగనున్న ఈ యాత్రం 400 రోజులపాటు జరగనుంది. జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర కుప్పం నుంచి మొదలు కానుంది.

ట్యాగ్స్​