లోకేశ్​ : జనవరి 27 నుంచి పాదయాత్ర చేస్తా

By udayam on November 25th / 8:51 am IST

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతున్నానని అధికారికంగా ప్రకటించారు. మంగళగిరి పర్యటనలో ఉన్న ఆయన టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలోని నూతక్కి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.మంగళగిరి నియోజకర్గంలో తన పాదయాత్ర నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని లోకేశ్ చెప్పారు.

ట్యాగ్స్​